విభిన్న అవయవ వైఫల్యం గల పిల్లల కోసం స్థా…

విభిన్న అవయవ వైఫల్యం గల పిల్లల కోసం స్థాపించిన అమృత ఇన్స్టిట్యూట్ నుండి సుమారు 80 మంది విద్యార్ధులు వారి తల్లిదండ్రులతో అమృతపురిని సందర్శించి అమ్మ దర్శనం తీసుకొని మరియు కలవటానికి వచ్చారు. ఆ పిల్లలు తాము చేసిన మాలలు ఒక దబ్బలో నింపి అమ్మకు ఇచ్చారు. అమ్మ వారి ఔషధాల గురించి, వారు స్వీకరించే వైద్య చికిత్స గురించి, వారి రోజువారీ నిత్యకృత్యాల గురించి ప్రశ్నించారు. ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ, వారి పేర్లు అడుగుతూ, వారి ఇష్టాలను తెలుసుకుంటూ, వారి సంక్షేమము గురించి అడిగారు. వారితో ఆడుతూ,పరిహసిస్తూ మరియు నవ్వుతూ, ప్రతి ఒక్కరితో సమయం గడిపారు. అమ్మ వారిలో కొంతమందిని పాట పాడమని, మరి కొందరిని వారి నైపుణ్యాలను అనగా సినిమా నటుల వలే నటించమనటం, అనుకరించటం వంటివి ప్రదర్శించమని అడిగారు. వారు దర్శనం కోసం వచ్చినప్పుడు ఆమె వారి నొటినుండి కారుతున్న లాలాజలాన్ని తుడిచారు. అమ్మ ప్రతి ఒక్కరి సుఖ దుఖాలతో తదాత్మ్యత చెందడం మరియు వారి ముఖంపై చిరునవ్వు తీసుకొని రావడం చూడడం వంటివి ఒక మనొహరమైన దృశ్యం. కొచ్చి మరియు కోడికోడే లో వికలాంగుల సంక్షేమం కోసం రెండు ప్రత్యేక పాఠశాలలను అమృత నడుపుతోంది. ఈ సంస్థలలోని పిల్లలకు ప్రాథమిక స్వీయసహయ నైపుణ్యాలను మరియు, వారి సామర్థ్యంపై ఆధారపడి వస్తువు మరియు సమాచార నైపుణ్యాలను గుర్తించడం బోధిస్తారు. మరింత సమాచారానికై అమ్మ పేజి amrit.am/2wuuzmc సందర్శించండి

video here : https://youtu.be/r8t1CQa-Wn4